నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదీ హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేశారు. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్ష హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండవ సంవత్సరం వారు మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం హాల్ …

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదీ

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేశారు. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్ష హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రెండవ సంవత్సరం వారు మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం హాల్ టిక్కెట్ నంబర్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్ల లో ఫోటోలు, సంతకాలు ఇతర సవరణలను కళా శాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దు కునే సౌకర్యం ఉంది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించన‌ న్నారు. ఆయా తేదీలలో ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాను న్నారు…

ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా ఫస్టియర్ హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెకండియర్ చదువుతున్న వారు ఫస్టియర్ లేదాా సెకండియర్ హాల్‌టికెట్(Inter Hall Tickets) నంబరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి సరిచేయించుకోవచ్చు.
ఫస్టియర్‌ ఎగ్జామ్స్ షెడ్యూల్

28-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I

01-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-I

04-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I

06-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I

11-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I

13-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I

15-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I

18-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జాగ్రఫీ పేపర్‌-I
సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్..

29-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II

02-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-II

05-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II

07-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II

12-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II

14-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II

16-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II

19-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జాగ్రఫీ పేపర్‌-II

Updated On 19 Feb 2024 12:49 PM IST
cknews1122

cknews1122

Next Story