పోలీసుకే ధమ్మీ ఇచ్చిన యువకుడు..
హైదరాబాద్ లో యూసుఫ్ గూడ చెక్ పోస్టు వద్ద ఆంజనేయులు అనే యువకుడు వీరంగం చేశాడు. తన వాహనాన్ని ఆపాడాని ట్రాఫిక్ అధికారిపై నానా బూతులు తిట్టాడు.
అంతటితో ఆగకుండా.. నా గురించి నీకు తెలియదు. నాతో పెట్టుకోకు. పంజాగుట్ట పీఎస్ లో నాగురించి అడుగంటూ కూడా ధమ్కీ ఇచ్చాడు. నేను మెంటల్ నా కొడుకుని.. , బాగుండందంటూ కూడా రెచ్చిపోయాడు.
అయితే.. ట్రాఫిక్ పోలీసులు చలానాలు కట్టి,బైక్ తీసుకెళ్లాలని చెప్పిన కూడా యువకుడు వినకుండా నానా హంగామా చేశాడు. బైక్ తాళాలు, లైసెన్స్ ఇవ్వాలని పదే పదే అధికారిని బెదిరింపులకు గురిచేశాడు.
నాకు ఫ్యామిలీ లేదు… నీ గురించి ఆలోచించుకో అంటూ కూడా బెదిరింపులకు గురిచేశాడు. పోలీసు శాఖను కూడా నానా బూతులు తిట్టాడు. నేను చావడానికి రెడీ.. నువ్వు రెడీనా అంటూ కూడా ఆవేశంతో ఊగిపోయాడు.
ఇక యువకుడు ఎంతకి మాటవినకపోయే సరికి పోలీసులు అదనపు సిబ్బందిని యూసుఫ్ గూడ చెక్ పోస్టుకు రప్పించి పంజాగుట్ట పీఎస్ కు తరలించారు. ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదు మేరకు పోలీసులు ఆంజనేయులు పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు.. యువకుడి ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు యువకుడి మెంటల్ కండీషన్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కుటుంబాన్నిపీఎస్ కు రప్పించి, దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.