మేడారం జాతర సందర్బంగా 4 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు
మేడారం జాతర సందర్బంగా 4 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. కాలినడకన, ఎడ్లబండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్ లోను మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారం చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు …
మేడారం జాతర సందర్బంగా 4 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. కాలినడకన, ఎడ్లబండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్ లోను మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారం చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇక మేడారం సందర్బంగా ములుగు జిల్లాలో నాల్గు రోజుల పాటు విద్యాసంస్థలకు (Holiday for Educational Institutions) సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. 21, 22, 23, 24 తేదీలలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని తెలిపారు.
ఈ నాలుగు రోజులు విద్యాసంస్థలను మూసి వేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటు మేడారం జాతరను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున ఇప్పటికే 110 కోట్ల రూపాయలను కేటాయించి ఏర్పాట్లు చేయడం జరిగింది.
అయితే సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని మేడారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భావించిన మంత్రి సీతక్క, మేడారంలోనే ఉండి ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
దీంతో భక్తులు ప్రభుత్వం ఫై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి మేడారం జాతర చాలా బాగా జరుగుతుందని ప్రజల నుండి స్పందన వస్తోందంటే సీతక్క జాతర కోసం ఎంతగా కష్టపడ్డారు అనేది అర్థం చేసుకోవచ్చు.
గత ప్రభుత్వ హయాంలో గద్దెల పైకి వెళ్లడానికి వీలు లేకుండా తాళం వేసే వారని, అమ్మవారికి మొక్కులు, బంగారం గద్దెలపైకి విసిరి వెళ్ళవలసి వచ్చేదని, కానీ ఈసారి అందుకు భిన్నంగా సామాన్య భక్తులకు కూడా అమ్మవారి దర్శనం సునాయాసంగా దొరుకుతుందని చెబుతున్నారు.
అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో, మేడారం జాతరకు మహిళలంతా సంతోషంగా రాగలుగుతున్నారు అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.