మైనారిటీ వెల్ఫెర్ సొసైటీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ కు సన్మానం
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 21
యాదాద్రి భువనగిరి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎండీ ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో తన సభ్యులతో కలిసి భువనగిరి పట్టణ రెవెన్యూ కార్యాలయంలో నూతన డిప్యూటీ ఎమ్మార్వో గా బదిలీపై వచ్చిన కోట్ల కళ్యాణ్ ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్బంగా ఇంతియాజ్ మాట్లాడుతూ..భువనగిరి మండల ప్రజలకు రైతులకు మైనారిటీ వర్గాలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలని కోరడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఎండీ ఇస్తియాక్ అహ్మద్,ఎండీ సిరాజ్,ఎండీ జాహేద్,ఎండీ గయాజ్ తదితరులు పాల్గొన్నారు.