మార్కులు తక్కువొచ్చాయని
డస్టర్తో బాది.
గురుకుల హాస్టల్ విద్యార్థులపై ఉపాధ్యాయుడి దాష్టీకం
తిరుమలాయపాలెం: తెలుగు పరీక్షలో మార్కులు తక్కు వగా
రావడంతో ఆగ్రహం పట్టలేకపోయిన ఉపాధ్యాయుడు విద్యా ర్థులను చితకబాదిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం మాదిరిపురం పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. గురుకుల హాస్టల్లో ఆరు నుంచి ఇంటర్ వరకు 516 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పదో తరగతి విద్యార్థులకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా తెలుగులో మార్కులు తక్కువగా వచ్చాయని తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణవు బోర్డు తుడిచే డస్టర్తో విద్యార్థుల వీపులపై చితకబాదాడు. ఎన్ని మార్కులు తక్కువ వస్తే అన్ని దెబ్బలు కొడతానంటూ తరగతిలోని 64 మంది విద్యార్థులకుగాను 25 మందిని కొట్టాడు. దీంతో విద్యార్థుల వీపులపై వాతలు తేలగా కొందరు ఇచ్చిన సమాచా రంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఎస్సై గిరిధర్రెడ్డి చేరుకుని ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామ ని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఉపాధ్యా యుడు లక్ష్మణ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు