మెగా డీఎస్సీకి తెలంగాణ సర్కారు రెడీ…
త్వరలో 11వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చెప్పిన కాంగ్రెస్..
ఇప్పుడు వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్రంలో భారీ మొత్తంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఏకంగా 11 వేలకుపైగా ఉపాధ్యాయ(Teacher) ఉద్యోగాలను మెగా డీఎస్సీ(DSC) ద్వారా భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే 11 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. టెట్ పరీక్ష కూడా నిర్వహించనున్నారు. మరోవైపు, 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
పలు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పలు ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. వీటిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, జూనియర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఉన్నాయి.
మొత్తం 12,186 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించింది. ధృవ పత్రాల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ ఉద్యోగాలకు గత ఆగస్టులో పరీక్షలు నిర్వహించారు.