జ్వరంతో గురుకుల స్టూడెంట్ మృతి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఓ గురుకుల స్టూడెంట్ చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండల కేంద్రానికి చెందిన షేక్అంజుమ్(15) ఆసిఫాబాద్‌లోని బాబాపూర్మైనారిటీ గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఈ నెల 19న జ్వరం రావడంతో క్లాస్ టీచర్ ఆమెకు ట్యాబ్లెట్లు ఇచ్చింది. 20న క్లాసులకు వెళ్లిన అంజుమ్‌కు జ్వరం తగ్గకపోవడంతో స్కూల్సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
అదే రోజు రాత్రి బాబాయి అష్రఫ్ వచ్చి అంజుమ్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. 21న ఆసిఫాబాద్‌లోని ఓ ప్రైవేట్హాస్పిటల్లో చూపించినా, జ్వరం తగ్గలేదు. గురువారం ఉదయం మహారాష్ట్రలోని చంద్రపూర్ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా దారిలోనే అంజుమ్ చనిపోయింది.
బాలిక మృతికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, సరైన సమయంలో స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.