అక్కడే దహనం చేయండి.. కంటతడి పెట్టిస్తోన్న బాసర IIIT విద్యార్థిని సూసైడ్‌ నోట్‌ బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని తెనుగు శిరీష ఉరి వేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తోంది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన శిరీష బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుతోంది. సొంత బావ మృతిని తట్టుకోలేకనే ఆమె చనిపోయినట్లు శిరీష రాసిన లేఖ …

అక్కడే దహనం చేయండి..

కంటతడి పెట్టిస్తోన్న బాసర IIIT విద్యార్థిని సూసైడ్‌ నోట్‌

బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని తెనుగు శిరీష ఉరి వేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తోంది.

సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన శిరీష బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుతోంది. సొంత బావ మృతిని తట్టుకోలేకనే ఆమె చనిపోయినట్లు శిరీష రాసిన లేఖ చెబుతోంది.

శిరీష రాసిన సూసైడ్‌ నోట్‌లో పలు విషయాలు వెల్లడించింది. తాను ప్రాణంగా ప్రేమించిన బావ ఆకాశ్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొంది. బావ ఆకాశ్‌ మృతిని తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొంది.

"నేను ఇలా చేయడం తప్పని తెలుసు. నన్ను క్షమించండి. మీరు బాధపడతారని తెలుసు. కానీ బావ లేని జీవితం నాకెప్పటికీ శూన్యమే. అందుకే నేను తన దగ్గరికి వెళ్లిపోతున్నా. బావ చావుకు కారణమైన వారిని వదలకండి.

అలాగే నా చివరి కోరిక కూడా తీర్చండి. బావ చనిపోయాక చివరిసారి కూడా చూడలేదు. అందుకే నన్నూ బావని దహనం చేసిన చోటే కాల్చండి. ఇదే నా చివరికోరిక. ప్లీజ్ నాన్న. మేము బతికి ఉన్నప్పుడు మేము ఎలాగూ కలిసి ఉండలేకపోయాం. కనీసం చనిపోయాక అయినా కలిసి ఉంటాం.

ఎవరికో భయపడి నేను చనిపోవడం లేదు. నాకు బావ ప్రేమ కావాలి. బావ లేకుండా ఉండలేను. నాకు నువ్వు, అమ్మ ఎంతో.. బావ కూడా అంతే నాన్న. తమ్ముడిని బాగా చూసుకో. అమ్మ జాగ్రత్త" అని శిరీష సూసైడ్ నోట్‌లో రాసింది.

కుమార్తె రాసిన సూసైడ్‌ నోట్‌ చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ విషయం తెలిసి ఉంటే కూతురిని కంటికి రెప్పలా కాపాడుకునే వారం కదా అంటూ వారు విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.

Updated On 23 Feb 2024 9:23 PM IST
cknews1122

cknews1122

Next Story