బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. అదుపు తప్పి డివైడర్ ను ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నందిత గెలిచారు. దివంగత నేత సాయన్న కూతురు లాస్య నందిత. MLA లాస్య నందిత మరణానికి నిపుణులు 3 ప్రధాన కారణాలు చెబుతున్నారు. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతీ సుజుకీ XL6 కారులో ప్రయాణం …

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు.

అదుపు తప్పి డివైడర్ ను ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నందిత గెలిచారు. దివంగత నేత సాయన్న కూతురు లాస్య నందిత.

MLA లాస్య నందిత మరణానికి నిపుణులు 3 ప్రధాన కారణాలు చెబుతున్నారు. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతీ సుజుకీ XL6 కారులో ప్రయాణం ఒక కారణం.

మిడిల్ సీటులో కూర్చున్న నందిత.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ముందు సీటుకు వేగంగా ఢీకొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ కావడం మరో కారణం.

10 రోజుల క్రితం ఆమె స్కార్పియోలో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు ఆ డ్రైవర్ను మార్చినా నందిత బతికేవారని చెబుతున్నారు.కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్‌ (ORR)పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి, ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు.

Updated On 23 Feb 2024 7:51 AM IST
cknews1122

cknews1122

Next Story