నీలాద్రి ఆలయ డైరెక్టర్ గా దగ్గుల నాగిరెడ్డి నియామకం..? నేడో, రేపో ఎమ్మెల్యే నుండి అధికారికంగా ఉత్తర్వులు రాక శివభక్తుడిని వరించిన డైరెక్టర్ పదవి ఖమ్మం / తల్లాడ ఫిబ్రవరి 24 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్ నీలాద్రి దేవస్థానం ఆలయ కమిటీ డైరెక్టర్ గా తల్లాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దగ్గుల నాగిరెడ్డిని నియమించినట్లు సమాచారం. ఈ మేరకు సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయిదయానంద్ నేడో, రేపో అధికారికంగా నియామకపు …

నీలాద్రి ఆలయ డైరెక్టర్ గా దగ్గుల నాగిరెడ్డి నియామకం..?

నేడో, రేపో ఎమ్మెల్యే నుండి అధికారికంగా ఉత్తర్వులు రాక

శివభక్తుడిని వరించిన డైరెక్టర్ పదవి

ఖమ్మం / తల్లాడ ఫిబ్రవరి 24 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్

నీలాద్రి దేవస్థానం ఆలయ కమిటీ డైరెక్టర్ గా తల్లాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దగ్గుల నాగిరెడ్డిని నియమించినట్లు సమాచారం.

ఈ మేరకు సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయిదయానంద్ నేడో, రేపో అధికారికంగా నియామకపు ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. దగ్గుల నాగిరెడ్డి తొలి నుండి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తల్లాడలో ప్రచారంలో భాగంగా తన సొంతంగా ఆర్థికంగా అండగా ఉండి విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే గెలుపులో తల్లాడ మండలం నుండి కీలక భూమిక పోషించారు.

నిత్యం భక్తిపరుడుగా ఉండే నాగిరెడ్డి రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ఎమ్మెల్యే మట్టా గెలుపు కోసం పనిచేశారు. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఆయనను నీలాద్రి ఆలయ కమిటీ డైరెక్టర్ గా నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. రేపో, మాపో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నానుయి. శివ భక్తుడికి ఈ పదవి రావడంతో అరుదైన గౌరవం దక్కనుంది.

Updated On 24 Feb 2024 1:20 PM IST
cknews1122

cknews1122

Next Story