PoliticalTelangana
Trending

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ట్వీట్ కు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ట్వీట్ కు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఆర్.ఎస్.ప్రవీణ్ ట్వీట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రిప్లై.

@RSPraveenSwaero గారూ,

మన తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు.

గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగాపడిందో, వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూసాం.

ఆ దశాబ్ద కాల విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, మన యువత భవితను పునర్నిర్మించాలనే సంకల్పంతో మా ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తోంది.

గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మీరు లేవనెత్తిన విషయాలను, ఇచ్చిన సూచనలను నిశితంగా పరిశీలించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తాం.

పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికై ఎవరు కలిసి వచ్చినా వారి విలువైన సూచనలు, సహకారం తీసుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

మా ప్రయత్నం.. మా తాపత్రయం అంతా.. తెలంగాణ ప్రజల మంచి కోసమే తప్ప, గుర్తింపు కోసం కాదని మీకు సవినయంగా మనవి చేస్తూ, మీరు మున్ముందు కూడా ప్రజా సమస్యలేమైనా సరే మా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button