గోరిలపాడు తండా రామాలయ నిర్మాణానికి కూసుమంచి మండల ఎంపిపి ఐదు లక్షల విరాళం
సికె న్యూస్ ప్రతినిధి కూసుమంచి
కూసుమంచి మండలంలోని గోరిలపాడు తండాలో నిర్మిస్తున్న రామాలయానికి అదే గ్రామానికి చెందిన కూసుమంచి మండల ఎంపిపి బానోత్ శ్రీనివాస్ నాయక్ కుటుంబ సమేతంగా రూ. 5 లక్షల విరాళం అందజేశారు.
ఇందుకు సంబంధించిన మొత్తం నగదును ఒకేసారి గ్రామ పెద్దల సమక్షంలో శనివారం ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్ కు అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బానోతు బాసు నాయక్, గుగులోత్ బాబు నాయక్, గ్రామ పెద్దలు బానోత్ బాసు నాయక్, బానోత్ నాగులు నాయక్, బానోత్ చందా నాయక్, బానోత్ శంకర్, తేజావత్ శ్రీను,రాగు నాయక్, తేజావత్ రామకోటి, చిన బాబు, కిషన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.