సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు..
సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. సికె న్యూస్ ప్రతినిధి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. నటి శ్రీరెడ్డి , వర్ర రవీందర్ రెడ్డి తో పాటు మరికొంతమంది ఉన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 8 మందిపై షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె పిర్యాదుపై …
![సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు..](https://cknewstv.in/wp-content/uploads/2024/02/n5823101981707735243299d7f1fe1b75c88f8493bcbeb13a1cc3e24f5111d37165cf4c7706a6b7e85c61da.jpg)
సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు..
సికె న్యూస్ ప్రతినిధి
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.
నటి శ్రీరెడ్డి , వర్ర రవీందర్ రెడ్డి తో పాటు మరికొంతమంది ఉన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మొత్తం 8 మందిపై షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె పిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు.
ఆ 8 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకొని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ.. వైఎస్ షర్మిల ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)