ప్రాణాలు పణంగా పెట్టి భారీ రైలు ప్రమాదాన్ని ఆపిన వృద్ధ దంపతులు ck న్యూస్ ప్రతినిధి కళ్లముందు ఘోర ప్రమాదం చోటు చేసుకున్నా పట్టించుకోకుండా మనకెందుకులే అని వెళ్లిపోయే ఈ సమాజం ఇది. ఈ పరిస్థితుల్లో కూడా ఓ వృద్ధ దంపతులు.. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. భారీ ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చెన్నై - భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో …

ప్రాణాలు పణంగా పెట్టి భారీ రైలు ప్రమాదాన్ని ఆపిన వృద్ధ దంపతులు

ck న్యూస్ ప్రతినిధి

కళ్లముందు ఘోర ప్రమాదం చోటు చేసుకున్నా పట్టించుకోకుండా మనకెందుకులే అని వెళ్లిపోయే ఈ సమాజం ఇది. ఈ పరిస్థితుల్లో కూడా ఓ వృద్ధ దంపతులు..

తమ ప్రాణాలను పణంగా పెట్టి.. భారీ ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

చెన్నై - భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు రోడ్డు ప్రమాదానికి గురయై.. పక్కనే ఉన్న రైలు పట్టాలపై పడిపోయింది.

ఇది గమనించిన వృద్ధ దంపతులు.. ఆ ట్రాక్ పై కాసేపట్లో ఎక్స్ ప్రెస్ రైలు వస్తుందని తెలుసుకుని.. పట్టాలపై వేగంగా పరుగెత్తారు. ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురుగా పరిగెత్తిన వృద్ధ దంపతులు.. ఎర్రని క్లాత్‌ ను ఊపుతూ.. ముందుకు సాగారు.

ఇది గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేసి ముందుకు చూడగా రైలు పట్టాలపై లోడుతో ఉన్న ట్రక్ పడి ఉండడం కనిపించింది. దీంతో భారీ ప్రమాదం నుంచి కాపాడినందుకు వృద్ధ దంపుతులను లోకో పైలట్, రైల్వే అధికారులు తెచ్చుకున్నట్లు తెలుస్తుంది.

Updated On 26 Feb 2024 11:48 AM IST
cknews1122

cknews1122

Next Story