తొమ్మిదో తరగతి బాలికపై పీఈటీ ఉపాధ్యాయుడు అత్యాచారం
ck news
విశాఖ జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది.తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై పీఈటీ మాస్టర్ అత్యాచారం చేశాడు.
మధురవాడకు చెందిన మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.ఈ క్రమంలో బాలికపై పీఈటీ దుర్గాప్రసాద్ కళ్లు పడ్డాయి. బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్న కుమార్తెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గర్భవతి అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
బాలికను ప్రశ్నించగా జరిగిన విషయం తెలియజేసింది. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.