రేపు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
సికె న్యూస్ ప్రతినిధి
పాలేరు : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజక వర్గంలో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పర్యటనలో భాగంగా ఉదయం పది గంటలకు తిరుమలాయపాలెంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఆ మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు.
పదకొండు గంటలకు కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తానని పేర్కొన్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో మినీ క్రీడా మైదానానికి శంకుస్థాపన చేసి మండలంలోని కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు.
అలాగే సాయంత్రం ఐదు గంటలకు 59వ డివిజన్ దానవాయిగూడెంలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై మంత్రి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.