మహిళను హత్య చేసిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 27,
మహిళను హత్య చేసిన కేసు లో జీవితఖైదు విదిస్తూ కొత్తగూడెం ప్రధాన జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు. 07-01-2019 న చుంచుపల్లి వీఆర్వో కాకా మంగతాయారు తన పిర్యాదు లో 06-01-2019 న రాత్రి చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు కాలనీ పక్కన కాళీ ఇండ్ల స్థలంలో టెంపరరీ ఇంటి గదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం పడి ఉన్నదని ఫోన్లో తనకు తెలియపరచగా తాను వెళ్లి చూడగా మహిళ చనిపోయి నేల మీద ఉన్నదని అప్పటి ఇన్స్పెక్టర్ టి. కరుణాకర్ కు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని,
దర్యాప్తు లో గుంటూరు జిల్లా కోసూరు కు చెందిన పెంద్రాల అల్లియ్య, పెంద్రాల కోటయ్య కుమారుడు అలియా కు కళ్యాణి కి ఎంగేజ్మెంట్ జరిగింది కానీ వివాహం కాలేదు. అల్లియకు పాపమ్మ తో వివాహం, కళ్యాణి కి రాంబాబుతో వివాహం జరిగింది. అలియా కు ఇద్దరు పిల్లలు కల్యాణికి ఒక అమ్మాయి కాగా కళ్యాణి భర్త రాంబాబు చనిపోయారు.
కాగా కళ్యాణి పెంద్రాల అల్లియ్య తో అక్రమసంబంధం పెట్టుకొగా అల్లియ్య భార్య పాపమ్మ రోజు తగాదా పడుతుండగా తట్టులోలేక తండ్రి కోటయ్య, కుమారుడు అలియా కళ్యాణి ని వదిలించుకోవాలని, డిస్టిబొమ్మల వ్యాపారానిమిత్తము యెల్లందు లో యుంటూ, కళ్యాణిని అలియ తన మోటారు సైకిల్ పై కొత్తగూడెం కు తీసికొని వస్తు, కళ్యాణి ని కొట్టగానే తీవ్ర గాయాలు కాగా తన తండ్రిని ఆటో లో రమ్మని హోసింగ్ బోర్డు వరకు తీసుకొని వెళ్లి, అప్పటికి ఇంకా జీవించి ఉన్నదని కోటయ్య కూడా కొట్టి చంపారని అప్పటి ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఛార్జ్ షీట్ కోర్ట్ లో దాఖాలు చేశారు. కోర్టు లో 19 మంది సాక్షులను విచారించారు.
అలియా, కోటయ్య ల పై నేరం రుజువు అయినదని, కోర్ట్ లో ఇద్దరికి జీవిత ఖైదు, ఇద్దరికి చేరి వేయి రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ప్రాసెక్యూషన్ ను అదనపు పబ్లిక్ ప్రాసెక్యూటర్ మీర్జా ఫీరదౌసి నిర్వహించారు. లైజన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ (హెచ్.సి.)ఏ. లచ్చు లు సహకరించారు.