హాల్ టికెట్స్ ఇవ్వని కళాశాలపై చర్యలు తీసుకోవాలి.
యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్ తలారే డిమాండ్.
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(USFI) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ జిల్లా అధికారి రఘురాజ్ సార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యు ఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్ తలారే మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని వేధింపులకు గురి చేస్తున్న ప్రైవేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఈ సదన్వంగా వారు అన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఇంటర్మీడియట్ హలో ఒక్కొక్క విధంగా విద్యార్థుల నుండి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు అని వారు మండిపడ్డారు ఇంటర్మీడియట్ కళాశాలలో ల్యాబ్ కాలేజ్ డే అంటూ బలవంతంగా విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు పరీక్షలు దగ్గర పడడంతో ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని కళాశాల యజమాన్యాలు విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అని ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు గురిచేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగిందని ఆయన అన్నారు లేనియెడల ఆ యొక్క కళాశాల ముందు ధర్నాలు, ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అయిన వెంటనే జిల్లా అధ్యక్షులు మంగేష్ , జిల్లా ఉపాధ్యక్షులు దత్త హరి ఉన్నారు