ఓడిపోయినా… ఆ నలుగురి ఘోషే వినిపిస్తోంది… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: తెలంగాణను భారాస అధినేత కేసీఆర్‌ దివాలా తీయించారని.. రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ.70వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని సచివాలయంలో సీఎం ప్రారంభించారు. ఎంఓయూపై సింగరేణి సీఎండీ బలరాం, …

ఓడిపోయినా… ఆ నలుగురి ఘోషే వినిపిస్తోంది… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణను భారాస అధినేత కేసీఆర్‌ దివాలా తీయించారని.. రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ.70వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని మండిపడ్డారు.

సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని సచివాలయంలో సీఎం ప్రారంభించారు. ఎంఓయూపై సింగరేణి సీఎండీ బలరాం, బ్యాంకర్లు సంతకాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండాసురేఖ, సింగరేణి ఎండీ బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

మోదీని మరోసారి ఎందుకు గెలిపించాలి?

తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు వారి వంతు పాత్ర పోషించారని రేవంత్‌ గుర్తుచేశారు. గత పదేళ్లుగా వారికి సరైన న్యాయం జరగలేదని, కారుణ్య నియామకాలు లేవన్నారు.

కార్మికులకు రూ.కోటి బీమా పథకం గతంలో ఎప్పుడూ లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహజ వనరులను ప్రైవేటు పరం చేస్తోందని విమర్శించారు. ఎన్నో ప్రభుత్వ సంస్థలతో పాటు బొగ్గు గనులకు కూడా వేలం వేస్తోందన్నారు.

మోదీని ప్రధానిగా మరోసారి ఎందుకు గెలిపించాలో కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘మద్దతు ధర అడుగుతున్న రైతులను చంపుతున్నందుకు మళ్లీ గెలిపించాలా? వరదలు వచ్చి హైదరాబాద్‌ నష్టపోతే.. కిషన్‌రెడ్డి ఏమైనా కేంద్ర నిధులు తెచ్చారా?’’ అని ప్రశ్నించారు.

Updated On 27 Feb 2024 10:58 AM IST
cknews1122

cknews1122

Next Story