అలరించిన మోహిని భస్మాసుర నృత్యనాటిక ప్రదర్శన
కళ కళ కోసం కాదు ప్రజలకోసం
సీనియర్ కళాకారులు దొంతగాని సత్యనారాయణ
సికె న్యూస్ జిల్లా ప్రతినిధి (రామయ్య) ఫిబ్రవరి 27
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్
ఫణిగిరి గుట్ట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం హుజూర్నగర్ సీనియర్ కళాకారుడు దొంతగాని సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మోహిని భస్మాసుర నృత్య నాటిక ప్రదర్శన భక్తులను అలరించింది.
అదేవిధంగా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం కళాకారులు బ్రహ్మాండమైనటువంటి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. దేవస్థానం ఈవో శ్రీ కొండారెడ్డి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కళాభిమానులు,భక్త మహాజనులు, ప్రజలు విచ్చేసి కళా ప్రదర్శనలను వీక్షించి ఆనందించారు.
కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే నానుడిని నిజం చేస్తూ ప్రజలను తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకొని అబ్బురపరిచిన దొంతగాని కళాబృందాన్ని ప్రజలు ఆశీర్వదించారు.ఇట్టి కార్యక్రమంలో
కళాకారులు జొన్నలగడ్డ గోవిందు, సైకిల్ షాప్ వెంకటేశ్వర్లు, భద్రాచలం, నాన్జీ, సుధీర్, అఖిల, సుకన్య, శ్వేత, రేణుక, మురళి, శ్రీహరి, నాయుడు తదితర కళాకారులను ఈఓ కొండారెడ్డి, ఆలయ పూజారి దామోదరాచార్యులు, దేవాలయ కమిటీ సభ్యులు ముడుంబై వెంకట నరసింహాచార్యులు, గుండా రమేష్ శాలువాలతో సత్కరించారు.