శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు
విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు జరిగాయి. ఈరోజు విద్యార్థులందరూ వారు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్స్, అలాగే వారి ద్వారా రూపొందించబడిన ఫిజిక్స్ నమూనాలు, కొన్ని సైన్స్ పరికరాలను తీసుకొని వచ్చి పాఠశాల ఆవరణలో ప్రదర్శించడం జరిగింది.
కొందరు విద్యార్థులు బ్లడ్ టెస్ట్, బి.పి. టెస్ట్ లు చేయడం జరిగింది. తోటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు సైన్స్ పరికరాలను పరిశీలించి విద్యార్థులను ఎంతగానో అభినందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఆత్మ శక్తిని మేలుకొలపడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది. బ్యాటరీతో నడిచే సైకిల్ రూపొందించిన విద్యార్థిని అభినందించి అతనికి ప్రథమ బహుమతి ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీమతి శ్రీవిద్య, పాఠశాల ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి నివేదిత, డీన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.