యువతి కిడ్నాప్‌నకు ఆటో డ్రైవర్‌ యత్నం ఆటో నుంచి దూకేసిన యువతి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స టూటౌన్‌ పోలీసుల అదుపులో డ్రైవర్‌ ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు.. యువతి దూకేసింది.. విశాఖలో తన వాహనం ఎక్కిన ఓ మహిళను ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. డ్రైవర్ తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పసిగట్టిన మహిళ ఆటో నుంచి దూకింది.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్‌ పరారీలో వుండగా, మహిళకు తీవ్రగాయాలయ్యాయి. …

యువతి కిడ్నాప్‌నకు ఆటో డ్రైవర్‌ యత్నం

ఆటో నుంచి దూకేసిన యువతి

తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స

టూటౌన్‌ పోలీసుల అదుపులో డ్రైవర్‌

ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు.. యువతి దూకేసింది..

విశాఖలో తన వాహనం ఎక్కిన ఓ మహిళను ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. డ్రైవర్ తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పసిగట్టిన మహిళ ఆటో నుంచి దూకింది.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆటో డ్రైవర్‌ పరారీలో వుండగా, మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఓ యువతిని ఆటోడ్రైవర్‌ కిడ్నాప్‌కు యత్నించగా..ఆమె భయపడి ఆటో నుంచి దూకేసింది. టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... నక్కవానిపాలెంలోని క్రాంతినగర్‌కు చెందిన కె.లహరి దొండపర్తి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షోరూంలో పనిచేస్తోంది. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద దొండపర్తిలోని షోరూంకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది.

ఆటో దొండపర్తి వద్దకు చేరగా.. నిలుపదల చేయమని యువతి అడిగింది. అయితే డ్రైవర్‌ ఆటో ఆపకుండా రైల్వేస్టేషన్‌ వైపు వేగంగా వెళ్లడంతో యువతి కేకలు వేసింది.

డీఆర్‌ఎం జంక్షన్‌ దాటి తర్వాత ఆటో నుంచి దూకేసింది. దీంతో ఆమెకు ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స అందించిన వైద్యులు టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఎంఎల్‌సీ కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్‌ను గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 28 Feb 2024 2:19 PM IST
cknews1122

cknews1122

Next Story