HyderabadPoliticalSanga reddyTelangana

కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. చేతికి ఇన్ ఫెక్షన్‌.. యువకుడి పరిస్థితి విషమం..

కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. చేతికి ఇన్ ఫెక్షన్‌.. యువకుడి పరిస్థితి విషమం..

కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. చేతికి ఇన్ ఫెక్షన్‌.. యువకుడి పరిస్థితి విషమం..

కడుపునొప్పి వస్తుందని వైద్యం హాస్పిటల్‌కు వెళ్లగా.. అతన్ని రూ.35లక్షలు పెట్టించేలా చేశారు వైద్యులు ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన బాధితుడి దయనీయ గాథ ఇది..

సంగమేశ్వర(33) అనే యువకుడు ఈ ఏడాది జూలై 23న రాత్రి 8 గంటలకు కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. ఇంజెక్షన్స్, సెలైన్లు పెట్టడంతో తన చేయి ఎర్రగా వాచింది.

డ్యూటీలో ఉన్న డాక్టర్ ని అడిగితే ఐస్ పెట్టుకోమంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక చేయి మరింత వాచింది. సంగారెడ్డిలో ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లగా చేతికి ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పారు.

తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్ కిమ్స్ కి సంగమేశ్వర్ ని తీసుకెళ్లారు. చేతికి ఇన్ ఫెక్షన్ సోకిందని చేయి తొలగించాలని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళనకి గురయ్యారు.

అక్కడి నుంచి యశోదా ఆస్పత్రికి తరలించారు. చేతికి ఇన్ ఫెక్షన్ తొలగించడానికి రూ. 35 లక్షలు ఖర్చు చేశారు. చికిత్స కోసం ఉన్న ఇల్లును అమ్మారని బాధితుడు బోరున విలపిస్తున్నాడు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేశాడు. చేతికి ఇన్ ఫెక్షన్ అయితే నువ్వు బతకవు కదా.. అంటూ సూపరింటెండెంట్ మురళికృష్ణ సమాధానం ఇచ్చారని చెబుతున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button