బీఆర్ఎస్ కు వరుస షాక్ లు... తాజాగా 59వ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ లోకి… మంత్రి పొంగులేటి సమక్షంలో చేరిన లలితా రాణి Ck news ఖమ్మం : ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతూ వస్తున్నాయి. తాజాగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్ కార్పొరేటర్ బట్టపోతుల లలితా రాణి మంత్రి పొంగులేటి, సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దానవాయిగూడెం పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో కార్పొరేటర్ తో …

బీఆర్ఎస్ కు వరుస షాక్ లు...

తాజాగా 59వ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ లోకి…

  • మంత్రి పొంగులేటి సమక్షంలో చేరిన లలితా రాణి

Ck news ఖమ్మం : ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతూ వస్తున్నాయి. తాజాగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్ కార్పొరేటర్ బట్టపోతుల లలితా రాణి మంత్రి పొంగులేటి, సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

దానవాయిగూడెం పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో కార్పొరేటర్ తో పాటు మరో వంద కుటుంబాలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరాయి.

వీరికి మంత్రి పొంగులేటి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

Updated On 29 Feb 2024 3:55 PM IST
cknews1122

cknews1122

Next Story