కొణిజర్లలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుడిపై కత్తితో దాడి
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిపై ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. కొణిజర్ల మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, కొణిజర్ల మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావును ఇద్దరు దుండగులు కత్తితో పొడిచారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
జిల్లా కాంగ్రెస్ నాయకులు, కొణిజర్ల మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్,జిల్లా కాంగ్రెస్ యల్డియం కోఆర్డినేటర్ సూరంపల్లి రామారావు పై రాజకీయ ప్రత్యర్ధులు బల్లెం, కత్తులతో గురువారం తెల్లవారుజామున 1గంట ప్రాంతంలో దాడి చేసీ గాయపర్చారు.ఈసంఘటన గురువారం తెల్లవారుజామున 1గంట ప్రాంతంలో ఆయన ఇంటి వద్దనే జరిగింది.పధకం ప్రకారం ప్రత్యర్ధులైన దుండగులు ఆయన బాత్ రూం వద్ద కాపుకాచి దాడిచేసి గాయపరిచారు.గతంలో కూడా శాసనసభ ఎన్నికలకు ముందు దుండగులు రామారావు పై దాడి చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకొనక పోవడం వలననే మరోసారి దాడిచేశారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
చాలాకాలంగా రెక్కి నిర్వహాంచి పధకం ప్రకారం ఈదాడిని నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.అయితే దాడిలో గాయపడ్డ సూరంపల్లి రామారావు ను ఖమ్మం కిమ్స్ కు తరలించారు. బల్లెం పోటు కు పెద్దప్రేగు గాయం కావడంతో ఆపరేషన్ చేసి కొంతబాగం తొలగించారు.మరో 48 గంటలవరకు పేషెంట్ కండీషన్ చెప్పలేమని హాస్పత్రి వర్గాలు సమాచారం.కొణిజెర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీపై గట్టి పట్టున్న రామారావు పై పార్లమెంటు ఎన్నికల ముందు దాడిజరగడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది.దుండగులను కటినంగా శిక్షించడంతో పాటు, రాజకీయ కోణంలో కూడా విచారణ జరపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.ఒక సారి దాడి జరిగిన ప్పటికీ సరైన రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం అవ్వడంతో ఈదాడిజరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.