నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 11062 పోస్టులతో 'మెగా డీఎస్సీ' నోటిఫికేషన్ వచ్చేసింది - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా elangana DSC 2024 Notification: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 29న వెలువడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీనిద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2,629 పోస్టులు, …

నిరుద్యోగులకు గుడ్ న్యూస్,

11062 పోస్టులతో 'మెగా డీఎస్సీ' నోటిఫికేషన్ వచ్చేసింది - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా

elangana DSC 2024 Notification: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 29న వెలువడింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీనిద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వీటిలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2,629 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్-727, పీఈటీలు-182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.

గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన రద్దుకు ప్రభుత్వం ఫిబ్రవరి 28న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాతపోస్టులకు కొత్తగా ఖాళీలను జతచేస్తూ తాజాగా కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది.

అయితే పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటిచే ప్రకటించారు. అంటే పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

Updated On 29 Feb 2024 11:41 AM IST
cknews1122

cknews1122

Next Story