బీజేపీ మహిళా కార్యకర్త దారుణహత్య.. ప్లే స్కూల్లో మృతదేహం.. Web desc : బీజేపీ మహిళా కార్యకర్త వర్షా(32)ని దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన తర్వాత ఆమె మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్లో బుధవారం పోలీసులు కనుగొన్నారు. నరేలాలోని స్వతంత్ర నగర్లో ఉంటున్న వర్షా అదృశ్యంపై ఆమె తండ్రి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న వర్షా తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె …

బీజేపీ మహిళా కార్యకర్త దారుణహత్య..
ప్లే స్కూల్లో మృతదేహం..
Web desc : బీజేపీ మహిళా కార్యకర్త వర్షా(32)ని దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన తర్వాత ఆమె మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్లో బుధవారం పోలీసులు కనుగొన్నారు.
నరేలాలోని స్వతంత్ర నగర్లో ఉంటున్న వర్షా అదృశ్యంపై ఆమె తండ్రి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న వర్షా తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె తన వ్యాపార భాగస్వామి సోహన్ లాల్‌తో చివరిసారిగా కనిపించింది.
సోహన్‌లో కలిసి వర్షా ఘోండా రోడ్లో డ్రీమ్ బెర్రీ ప్లేస్కూల్ ప్రారంభించినట్లు వర్షా తండ్రి తెలిపారు. తను ఫిబ్రవరి 24న వర్షాకు ఫోన్ చేసిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్ రిసీవ్ చేసుకున్నాడని, అతను సోనిపట్‌లోని హర్షంలో ఉన్నట్లు తెలిపాడని,
రైలు పట్టాలపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని చెప్పినట్లు విజయ్ కుమార్ తెలిపారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని సోహాన్‌గా అనుకున్నప్పటికీ.. హర్షనా వద్ద అతని ఆనవాళ్లు కనిపించలేదని చెప్పాడు.
పోలీసులు ప్లేస్కూల్లో వెతికిన ఏం దొరకలేదు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఆఫీసుకి తాళం వేసి ఉండటంతో పోలీసులు అందులోకి వెళ్లలేదు. సోహాన్ మొబైల్ ట్రాక్ చేయడం ద్వారా అతను లొకేషన్ని చివరిసారిగా హర్యానాలోని బరౌటాలో పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉంటే వర్షా తండ్రి విజయ్ కుమార్ బుధవారం ప్లే స్కూల్‌కి వెళ్లి షట్టర్ తెరవాలని ఇంటి యజమానిని కోరాడు. వర్షా మృతదేహం అందులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వర్షా గొంతు కోసి, ఆమె దుపట్టా మెడకు చుట్టి ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమికంగా హత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సోనిపట్ ఏరియాలో ఫిబ్రవరి 25న అక్కడి రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇది సోహన్ లాల్‌దే అని అనుమానిస్తున్నారు. వర్షను హత్య చేసి సొహన్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
