
కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో హత్య.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
సెప్టెంబర్ 23,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో హత్యకు గురైన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావు (గౌతంపూర్ ఏరియా) నివసిగా గుర్తింపు..
విచక్షణారహితంగా కొట్టి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..హత్యకు గల కారణాలు తెలియ వలసి ఉంది… ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్,3 వ టౌన్ పోలీస్ సిబ్బంది..
నిందితుడు రామవరం వాసిగా అనుమానం.. ముఖానికి మాస్క్ తో వచ్చి, ఇంట్లో కి వెళ్లి సుత్తి తో తల పగులగొట్టి హత్య, హత్య జరిగిన ప్రాంతం లో భీతావహ పరిస్థితి.
నిందితుడిని బైక్ పై వదిలిన మరో వ్యక్తి. సీసీ కెమెరాలు జల్లెడ పడుతున్న పోలీసులు తదుపరి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.