నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులు అరెస్టు… సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), మార్చ్ 02, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఖమ్మం జనార్దన్ రెడ్డి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఖమ్మం గణేష్ గారల ఆదేశం మేరకు శనివారం తెల్లవారుజామున ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఖమ్మం బృందం భద్రాచలం వద్ద రూట్‌ వాచ్‌ నిర్వహించింది. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. …

నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులు అరెస్టు…

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మార్చ్ 02,

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఖమ్మం జనార్దన్ రెడ్డి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఖమ్మం గణేష్ గారల ఆదేశం మేరకు శనివారం తెల్లవారుజామున ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఖమ్మం బృందం భద్రాచలం వద్ద రూట్‌ వాచ్‌ నిర్వహించింది.

అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన పాముకుంట్ల కార్తీక్ రావు మరియు కుంభం దుర్గ ప్రసాదులు హైదరాబాదులో చదువుతున్నారు. చిన్నప్పటి నుండి మిత్రులైన వీరిద్దరూ గంజాయి మరియు ఇతర వ్యసనాలకు జలసాలకు బానిస అయ్యారు.

ఒరిస్సాకు వెళ్లి గంజాయి తెచ్చుకుంటే తాము వినియోగించు కోవడంతో పాటు ఇతరులకు అమ్మి డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో కార్తీక్ చెందిన బైకుపై మల్కనగిరి అటవీ ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎక్సైజ్ అధికారుల రూట్ వాచ్ లో పట్టుబడ్డారు.

వీధి వద్ద నుండి అధికారులు 1950 గ్రాముల ఎండు గంజాయి, 2 మొబైల్ ఫోన్లు, 1 బైక్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పంచనామా కింద కేసు బుక్ చేసి భద్రాచలం ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.

ఈ రూట్ వాచ్ లో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకరి రమేష్ తో పాటు సిబ్బంది కరీం, హనుమంతరావు, సుధీర్, హరీష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated On 2 March 2024 7:02 PM IST
cknews1122

cknews1122

Next Story