ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి... ck news జూనియర్​ అకౌంట్స్​ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడిన ఘటన హబ్సిగూడ విద్యుత్ శాఖ సర్కిల్​ కార్యాలయంలో చోటు చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి. నాచారం ఏడీఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టిజెన్​ భరత్​కు సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని జూనియర్​ అకౌంట్స్​ అధికారి విజయ్​ సింహరెడ్డిని ఆర్టిజన్​ భరత్​ కొద్దిరోజులుగా వేడుకుంటున్నాడు. లంచం చెల్లిస్తే కానీ చెల్లించేది లేదన్నాడు. సక్రమంగా పనిచేసిన వేతనాలు విడుదల …

ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి...

ck news

జూనియర్​ అకౌంట్స్​ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడిన ఘటన హబ్సిగూడ విద్యుత్ శాఖ సర్కిల్​ కార్యాలయంలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.

నాచారం ఏడీఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టిజెన్​ భరత్​కు సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని జూనియర్​ అకౌంట్స్​ అధికారి విజయ్​ సింహరెడ్డిని ఆర్టిజన్​ భరత్​ కొద్దిరోజులుగా వేడుకుంటున్నాడు.

లంచం చెల్లిస్తే కానీ చెల్లించేది లేదన్నాడు. సక్రమంగా పనిచేసిన వేతనాలు విడుదల చేసేందుకు రూ.35 వేల లంచం ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. దీంతో హైదరాబాద్​-2 ఏసీబీ యూనిట్​ అధికారులను ఆశ్రయించాడు.

ఈ క్రమంలో శుక్రవారం విజయ్ సింహారెడ్డి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన నాంపల్లి కోర్టుకు తరలించి చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు తరలించారు.

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి సంప్రదించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు కోరారు.

Updated On 2 March 2024 11:07 AM IST
cknews1122

cknews1122

Next Story