కేటీఆర్.. ఇద్దరం రిజైన్ చేసి సిరిసిల్లలో పోటీ చేద్దామా : మంత్రి వెంకట్​రెడ్డి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్​కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సవాల్ ​విసిరారు. "నేను నల్గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను..దమ్ముంటే కేటీఆర్​సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామా" అని సవాల్ చేశారు. మంత్రి వెంకట్​రెడ్డి శుక్రవారం సెక్రటేరియెట్​లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డిని సవాల్​చేసే స్థాయి కేటీఆర్​కు లేదని మండిపడ్డారు. …

కేటీఆర్.. ఇద్దరం రిజైన్ చేసి సిరిసిల్లలో పోటీ చేద్దామా : మంత్రి వెంకట్​రెడ్డి

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్​కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సవాల్ ​విసిరారు. "నేను నల్గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను..దమ్ముంటే కేటీఆర్​సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి..

ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామా" అని సవాల్ చేశారు. మంత్రి వెంకట్​రెడ్డి శుక్రవారం సెక్రటేరియెట్​లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డిని సవాల్​చేసే స్థాయి కేటీఆర్​కు లేదని మండిపడ్డారు.

కేటీఆర్​సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారని అక్కడే పోటీ చేసి ఎవరేంటో తేల్చుకుందామన్నారు. మొన్నటి ఎన్నికల్లో కేటీఆర్​రూ.200 కోట్లు ఖర్చు పెట్టి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడని చెప్పారు.

అంత తక్కువ మెజార్టీతో గెలిస్తే తనైతే రాజీనామా చేసే వాడినని తెలిపారు. ఇప్పుడు సిరిసిల్లలో ఇద్దరం పోటీ పడితే తనే గెలుస్తానని అన్నారు. కేటీఆర్​ఓడిపోతే పార్టీని క్లోజ్​చేస్తానని కేసీఆర్​తో ప్రకటన చేయిస్తారా అని ప్రశ్నించారు.

తాను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. "నిజానికి కేటీఆర్​ది నా స్థాయి కూడా కాదు.

కేటీఆర్​కు టెక్నికల్​నాలెడ్జ్​లేదు, చిన్న పిల్లగాడు. ఆయనకు క్యారెక్టర్​లేదు, లక్షల కోట్లు మాత్రమే ఉన్నయి. నా దగ్గర డబ్బు లేదు.. క్యారెక్టర్​ మాత్రమే ఉంది' అని అన్నారు.

Updated On 2 March 2024 11:10 AM IST
cknews1122

cknews1122

Next Story