KhammamPoliticalTelangana

ఖమ్మంలో బీఆర్ఎస్‌ను గాలికొదిలేసిన మాజీ మంత్రి…

ఖమ్మంలో బీఆర్ఎస్‌ను గాలికొదిలేసిన మాజీ మంత్రి...

ఖమ్మంలో బీఆర్ఎస్‌ను గాలికొదిలేసిన పువ్వాడ…

సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం

బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పువ్వాడ పై కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు విజయం సాధించారు.

ఓటమి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం మారి 3 నెలలైనా పువ్వాడ బయటకు రాకపోవడంతో ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ నైరాశ్యంలో ఉంది.

ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ మౌనం తో అక్కడి బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తి తో ఉంది. మరోవైపు వెంటాడుతున్న వరుస కేసులతో బీఆర్ఎస్ క్యాడర్ భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు భరోసాను ఇచ్చే నాయకులు లేకపోవడంతో వేరే పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఖమ్మం టౌన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తనకు పోటీ ఎవరు లేకుండా చేసుకొని.. ఖమ్మం నగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పదేళ్లపాటు చక్రం తిప్పారు పువ్వాడ.

మంత్రిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. కేసీఆర్ కూడా సీనియర్ నేతలను పక్కన పెట్టి ఆయనకే ప్రాధాన్యం ఇచ్చారు.ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా చక్రం తిప్పుదాం అని అనుకున్న పువ్వాడ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు.

ఇటీవల కాలంలో నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడుతుండడంతో గత కొన్ని రోజులుగా పార్టీ క్యాడర్ కు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి పువ్వాడ కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button