పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లను ఓడించాలి
Ck news ఖమ్మం
కొనిజర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పరికపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు లేకున్నా రాష్ట్రాలు అభివృద్ధి చేసాం.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బిల్లులన్నింటికి కే.సి.ఆర్. వంత పాడాడు. కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలను ప్రవేశ పెట్టినప్పుడు బిఆర్ఎస్ పార్టీలు ఎందుకు నోరువిప్పలేదు.
బయటికి మాత్రం ఆ నల్ల చట్టాలను విమర్శిస్తున్నట్టు దొంగనాటకాలు ఆడిన బీఆర్ఎస్ పార్టీ, బీజేపి పార్టీకి బీఆర్ఎస్ పార్టీలు డిల్లీ కి దోస్తీ గల్లిలో లొల్లి అన్నట్టుగా నాటకాలు చేస్తున్నారు.
మీరు ఎన్ని పేర్లు మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమి లేదు బీజేపి బీఆర్ఎస్ పార్టీలు ఒక తాను ముక్కలే.. రాష్ట్రములో 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ అవినీతికి అండగా బీజేపీ ఉంటుదని ఎద్దేవా చేశారు.
10 సంవత్సరాల ప్రధాని అప్రజాస్వామ్య పాలనకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, రాష్ట్రము లో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. దేశంలో అవినీతి పోవాలంటే, ప్రజాస్వామ్యం బ్రతకాలంటే, రాజ్యాంగం నిలవాలంటే కాంగ్రెస్ గెలవాలి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు.
ఖమ్మం విప్లవాల గడ్డ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలను కోరారు. రాచరిక పాలనకు చరమగీతం పాడాలి ఖమ్మం పోరాటాల గడ్డ, మరోసారి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఖమ్మం జిల్లా ప్రజలను మోసం చేసిన బీజెపి, బీఆర్ఎస్ లకు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు.
ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తూ అనుదినం ప్రజల్లో ఉంటున్నాం. ఆరు గ్యారంటీలానే కాదు ఇన్నాళ్ళు ఆదరణకు నోచుకోని ప్రజల ఆక్రందనలను అర్థం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన జిల్లాలోని సమస్యలను పరిష్కరిస్తున్నాం. స్థానికంగా జరిగిన అవినీతిని త్వరలో బట్ట బయలు చేస్తాం.
కే.సి.ఆర్ కాలంలో మాటలు పడిపోయిన లీడర్లందరూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒక్కసారి గతంలో ఖమ్మం కు జరిగిన అన్యాయం గురించి మీరు ఎందుకు పెదవి విప్పలేదో ఆత్మ విమర్శ చేసుకోండి. ప్రజలు వీరికి కర్రు కాల్చి మరోసారి వాత పెట్టే రోజులు ముందున్నాయని అన్నారు.