సంతలో సరుకుల మద్యం అమ్మకాలు!!
సూర్యాపేట జిల్లా ప్రతినిధి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుస కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పథర్థాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
పలు గ్రామాల్లో బెల్టు షాపులు కూడా మూసి వేయించాలని ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆదేశాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
విచ్చలవిడిగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తెలు స్తోంది. తాజాగా.. వెలుగు జూసిన ఈ ఘటనే నిదర్శనంగా మారింది.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గాకు సమీపంలోని దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు వెంటనే మహి ళలు అడ్డగోలుగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు.
సంతలో సరుకులు అమ్మి నట్లు క్వార్టర్ బాటిల్స్ అమ్మకాలు జరుపుతు న్నారు. పర్మిట్ వైన్స్ వాళ్ళే సంవత్సరానికి బాండ్ రాసి ఇస్తున్నట్లు సమాచారం. అసలు ఈ మద్యం ఒరిజినల్? నకిలీదా? అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం మహిళలు మద్యం అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
మాటల్లో కాదు.. చేతల్లో చూపించి ఆదర్శంగా నిలవాలని సూచనలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు వెంట మద్యం అమ్మకాలు అరికట్టాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.