లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ బీఎస్పీ పొత్తు..!
కెసిఆర్ తో ఆర్. ప్రవీణ్ కుమార్ భేటీ
ఉసురుమంటున్న బీఎస్పీ కార్యకర్తలు..?
కెసిఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్, బీఎస్పి పొత్తు పెట్టుకుంటాయని తెలుస్తోంది.
ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయనుండగా టిఆర్ఎస్ మద్దతు ఇస్తుందని సమాచారం. ఇవాళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసిఆర్ నేతలతో చర్చించారు.
ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ కుమార్ కు మద్దతు ఇచ్చేందుకు ఆయన అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి.
బీఎస్పి నాయకుల అగ్గిలం మీద గుగ్గిలం..?
గతంలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై చండ్రనిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావాజాలం వేరని అలాంటి వ్యక్తి తెలంగాణ దొరగా అభివర్ణించిన కేసీఆర్ ను కలుసుకోవడంపై బిఎస్పీ కార్యకర్తలు లోలోపల మదన పడుతున్నారు.
కొంతమంది నాయకులు పొద్దున్నే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ పార్టీతో కలవకలేదని కెసిఆర్ తో ఎలాంటి మిలాఖాత్ ఉండదని మీడియా ప్రకటనల విడుదల చేశారు. వీటన్నింటికీ సమాధానం చెప్పే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కెసిఆర్ ను కలవడంతో ఇప్పుడు బీఎస్పీ నాయకులు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు అని సమాచారం.
కొంత మంది నాయకులు అయితే కేసీఆర్ ను కలవడం పరువు పోయిందని భావిస్తున్నారు. మీడియాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తప్పుడు వార్తలు రాస్తే క్రిమినల్ కేసులు పెట్టి జైల్లోకి పంపుతామని చెప్పిన నాయకులు ఇప్పుడు మీడియాకు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి..?