HyderabadPoliticalTelangana

నన్ను గద్దె దింపాలంటే మోడీతో కేసీఆర్ కలవాలి

నన్ను గద్దె దింపాలంటే మోడీతో కేసీఆర్ కలవాలి

నన్ను గద్దె దింపాలంటే మోడీతో కేసీఆర్ కలవాలి: సీఎం రేవంత్‌రెడ్డి..

రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే మోడీతో కేసీఆర్ కలవాలని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..
అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడే లేడని అన్నారు. తనను మరో ఐదు నెలల్లో గద్దె దింపుతామని అంటున్నారని.. ఒక వేళ ఆ పరిస్థితే వస్తే.. కేసీఆర్ మోడీతో కలవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ప్రధాని మోడీని పెద్దన్న అన్నందుకు రచ్చ చేస్తున్నారని.. అమెరికాను అగ్రరాజ్యం అన్నట్లుగా.. తాను కూడా నరేంద్ర మోడీ ప్రధాని కాబట్టే ఆయనను పెద్దన్న అని సంబోధించానని క్లారిటీ ఇచ్చారు.

మోడీతో కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే చర్చించానని, కేసీఆర్‌లా చెవిలో వెళ్లి చెప్పలేదని అన్నారు. అదేవిధంగా మేడిగడ్డపై ఎన్డీఎస్ఏకు లేఖ రాశామని, వారు నాలుగు నెలల్లో పూర్తి నివేదిక ఇస్తామని చెప్పారని వెల్లడించారు.

ఆదిలాబాద్‌కు సంబంధించి 1.60 లక్షల ఎకరాల సాగునీటీ కోసమే మోడీని కలిశానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 7, 8న తొలి జాబితా ఉంటుందని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button