అన్నంలో పురుగులు.. మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థినుల ఆందోళన TS: హైదరాబాద్ శివారు గండిమైసమ్మలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ క్యాంపస్లో విద్యార్థినులు నిరసనకు దిగారు. నిన్న రాత్రి అన్నం, స్వీటులో పురుగులు వచ్చాయని పేర్కొంటూ క్యాంపస్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. యాజమాన్యం నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ 'వీ వాంట్ జస్టిస్' అని నినాదాలు చేశారు. ఇటీవల కూడా అన్నంలో పురుగులు వచ్చాయని స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ లో ఉద్రిక్తత …

అన్నంలో పురుగులు.. మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థినుల ఆందోళన

TS: హైదరాబాద్ శివారు గండిమైసమ్మలోని మల్లారెడ్డి

ఇంజినీరింగ్ క్యాంపస్లో విద్యార్థినులు నిరసనకు

దిగారు. నిన్న రాత్రి అన్నం, స్వీటులో పురుగులు

వచ్చాయని పేర్కొంటూ క్యాంపస్ ఆవరణలో ఆందోళన

చేపట్టారు. యాజమాన్యం నాణ్యమైన ఆహారం

పెట్టాలంటూ 'వీ వాంట్ జస్టిస్' అని నినాదాలు చేశారు.

ఇటీవల కూడా అన్నంలో పురుగులు వచ్చాయని

స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు.

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారు గండి మైసమ్మ లో ఉన్న MREC క్యాంపస్ వసతి గృహంలో 2024, మార్చి 4వ తేదీ సోమవారం రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు.

రాత్రి భోజన సమయంలో అన్నం, స్వీట్ లో పురుగులు రావడంతో విద్యార్థులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్ లో నిరసన చేపట్టారు. క్వాలిటీ ఫుట్ పెట్టడం లేదని.. వీ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు.

ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నాలు చేశారు. దీంతో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెడతామని కాలేజీ చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.

అయితే, కొద్ది రోజులకే మళ్లీ అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి వచ్చేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది.

Updated On 5 March 2024 1:29 PM IST
cknews1122

cknews1122

Next Story