—ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు..
— రామా నగరానికి చెందిన ఓ నిరుపేద చదువుకుని విజయం.
సికే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
ప్రతి విద్యార్థి తాను చదువుకున్న పాఠశాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యే స్థాయికి ఎదగాలని విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు అన్నారు.
సత్తుపల్లి మండలం రామనగరం గ్రామానికి చెందిన కాట్రాల మధు విశ్వశాంతి విద్యాలయంలో పదవ తరగతి వరకు చదివారు . ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షలకు హాజరై ఒకేసారి ఓపెన్ క్యాటగిరిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు .
ఈనెల నాలుగో తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా నియామక పత్రం అందుకున్నాడు.
ఈ సందర్భంగా బుధవారం విశ్వశాంతి విద్యాలయంలో ఉపాధ్యాయులు శాలువా, జ్ఞాపకాలతో మధును ఘనంగా సత్కరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టం.
అలాంటిది ఓపెన్ క్యాటగిరిలో మూడు ఉద్యోగాలు సాధించటం విశేషమని ప్రిన్సిపల్ నాగేశ్వరరావు అభినందించారు.
ఇటీవల జరిగిన కానిస్టేబుల్, గ్రూప్ 4, గురుకుల డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షల్లో అగ్ర శ్రేణి ఫలితాలు సాధించి ఆ పోస్టులకు అర్హత సాధించాడు.
మధు గత సంవత్సరం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి మెయిన్స్ ప్రిపేర్ అయాడు. ,గ్రూప్4 లో ఖమ్మం జిల్లా స్థాయిలో 25వ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు.
మధు తండ్రి వెంకట్రామయ్య రామనగరం గ్రామంలో రెండు ఎకరాల రైతు. పాలిటెక్నిక్ డిప్లమా అనంతరం ఓపెన్ డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.