ఎండాకాలం దృష్ట్యా నీటి ఎద్దడి రాకుండా చూడాలి
మండల సమావేశంలో
ఎంపీపీ గూడేపు శ్రీను
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 06
మండల ప్రజా పరిషత్ కార్యాలయం హుజూర్ నగర్ నందు బుధవారం ఉదయం 11.00 గం లకు ఎంపిపి గూడెపు శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించటం జరిగింది.ఇట్టి సమావేశములో రాబోవు వేసవిని దృష్టి లో ఉంచుకొని నీటి ఎద్దటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు రు.అంతేకాక ఉపాధి హామీ పని దినములు అర్హులైన ప్రతి ఒక్కరికి కల్పించాలని అన్ని శాఖలపై సంబందిత శాఖ అధికారులతో ప్రగతి పై చర్చించారు. ఇట్టి సమావేశం లో జడ్.పి.టి.సి. కొప్పుల సైది రెడ్డి, వైస్ యం.పి.పి. సింగతల సైదమ్మ యం.పి.టి.సిలు ,ముడెం గోపి రెడ్డి ,వల్లభనేని విజయ లక్ష్మి ,రణపంగు కాశమ్మ,మచ్చ వెంకటేశ్వర్లు చీకూరి రాజారావ్ యం.పి.డి. ఓ .పి.లావణ్య వివిధ శాఖల అధికారులు ,గ్రామ ప్రత్యేక అధికారులు పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.