ఐఎంఏ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
ముఖ్య అతిథిగా షాద్ నగర్ పట్టణ సీఐ ప్రతాప్ లింగం.
99.9 శాతం పేషెంట్లను బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాం : డాక్టర్లు
ప్రైవేటు ఆస్పత్రులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి సీఐ ప్రతాప్ లింగం
డాక్టర్లు కావాలని ఎవరిని చంపరు : ఐఎంఏ వెల్లడి.
హాజరైన పట్టణ ప్రముఖులు, లాయర్లు, సంఘసంస్కర్తలు తదితరులు.
శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం:మార్చ్ 6(సి కే న్యూస్ )
తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ద్వారా ఏర్పాటు చేసిన నియమ నిబంధనలు ఆసుపత్రుల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచించారు.
బుధవారం ఐఎంఏ భవనంలో తాలూకా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, మరియు డాక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ భవనంలో సంఘ సంస్కర్తలు, పట్టణ ప్రముఖులు, లాయర్లు, పోలీసులు తదితరులతో కలిసి ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ వద్ద నెలకొంటున్న సంఘటనలు బాధాకరమైన విషయమని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లీగల్ గా వెళ్లడం మంచిదని ఆయన అన్నారు. నేటి సమాజంలో డాక్టర్ సేవలు ఎంతో అవసరమని, ఒక సర్జరీ చేసేటప్పుడు వారి మైండ్ చాలా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు.
తద్వారా పేషెంట్లకు సరైనా వైద్యం అందుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్ చనిపోతే కేవలం ఒకరినే బాధ్యులను చేయొద్దని, అటు పేషెంట్ వారిది , ఇటు ఆసుపత్రి యజమాన్యం ఇద్దరి వాదనలు విన్న తర్వాతానే వార్తలు రాయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుందని ఆయన సూచించారు.
ఆసుపత్రి వారు తప్పు చేస్తే వారిపై లీగల్ గా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, వారి సర్టిఫికెట్ ను రద్దు చేయించవచ్చని అయినా తెలిపారు. ఆసుపత్రుల వద్ద ఆందోళనలు చేయడం వల్ల ఐసీయూలో ఉండే ఇతర పేషెంట్లు చనిపోయే పరిస్థితి ఉంటుందని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన వివరించారు.
అదేవిధంగా ఐఎంఏ డాక్టర్లు మాట్లాడుతూ… డాక్టర్ వృత్తి చేపట్టిన ప్రతి ఒక్కరూ 99.9 శాతం పేషెంట్లను బ్రతికించడానికి ప్రయత్నం చేశారు తప్ప ఎవరు కూడా చనిపోవాలని ట్రీట్మెంట్ చేయరని వారు పేర్కొన్నారు. క్రిటికల్ పొజిషన్ లో ఉన్న పేషెంట్లు ఆసుపత్రులకు వస్తే వారికి సరియైన వైద్యం అందించడానికి డాక్టర్లు చాలా కష్టపడతారని, అలాంటి సమయంలో డాక్టర్లపై చాలా ఒత్తిడి ఉంటుందన్నారు.
సరైన సమయంలో క్రిటికల్ కేసులు చేపట్టకపోతే చాలామంది చనిపోయే ప్రమాదం ఉంటుందన్న మానవత్వ దృక్పథంతో కేసులు టేకప్ చేయడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా ఒక పేషెంట్ చనిపోతే తప్పు మొత్తం డాక్టర్ చేశారని కొంతమంది కావాలని డాక్టర్లపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి చర్యలు మానుకొని తమ వైపు కూడా ఒక్కసారి ఆలోచించాలని వారు ఈ సందర్భంగా కోరారు.
అవసరమైతే కేసులు పెట్టి న్యాయపరంగా వెళ్లాలని తమ తప్పు ఉంటే న్యాయస్థానమే తమపై చర్యలు తీసుకుంటుంది కానీ ఇలా నిందలు వేయడం, బ్లాక్ మెయిల్ చేయడం సబబు కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సైతం ఎంతోమంది డాక్టర్లు తమ ప్రాణాలు లెక్క చేయకుండా కేవలం ప్రజలను బ్రతికించాలని లక్ష్యంతోనే విధులు నిర్వహించారని వారు గుర్తు చేశారు.
భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో లాయర్లు, పోలీసులు, సంఘసంస్కర్తలు తదితరులు సలహాలు సూచనలు మేరకు నడుచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు వివరించారు. అనంతరం లాయర్లు, సంఘ సంస్క ర్తలు తదితరులు మాట్లాడుతూ వారి సూచనలు సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్లు సాయిబాబా, దిలీప్ చంద్ర, నాగిరెడ్డి, రమేష్ బండారి, ఐఎంఏ తాలూకా సెక్రెటరీ డాక్టర్ కే కార్తీక్, ట్రెజరర్ డాక్టర్ కృష్ణ చైతన్య, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయలక్ష్మి రాథోడ్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ గణేష్, డాక్టర్ వంశీ, డాక్టర్ శ్రీనివాస్, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు డాక్టర్ చందులాల్, డాక్టర్ నాగవర్ధన్ రెడ్డి, సంఘసంస్కర్తలు లక్ష్మణ్, లాయర్లు పట్టిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.