డ్రగ్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు… మెడికల్ షాప్ నిర్వాహకుడి అరెస్టు..!సూర్యాపేట జిల్లాలో డ్రగ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ మెడికల్ షాప్ నిర్వాకుడిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో దుర్గ భవాని మెడికల్ షాప్ లో నిషేధిత టానిక్ లు విక్రయిస్తున్నారనే సమాచారంతో మెడికల్ షాప్ పై ఎక్సైజ్, డ్రగ్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. నిషేధిత టానికులు స్థానికులకు విక్రయిస్తున్నట్లుగా తేలడంతో పాటు దాడులలో టానిక్ లు, మెడికల్ షాప్ …

డ్రగ్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు…

మెడికల్ షాప్ నిర్వాహకుడి అరెస్టు..!
సూర్యాపేట జిల్లాలో డ్రగ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ మెడికల్ షాప్ నిర్వాకుడిని అరెస్ట్ చేశారు.

వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో దుర్గ భవాని మెడికల్ షాప్ లో నిషేధిత టానిక్ లు విక్రయిస్తున్నారనే సమాచారంతో మెడికల్ షాప్ పై ఎక్సైజ్, డ్రగ్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.

నిషేధిత టానికులు స్థానికులకు విక్రయిస్తున్నట్లుగా తేలడంతో పాటు దాడులలో టానిక్ లు, మెడికల్ షాప్ ను సీజ్ చేశారు.

అదేవిధంగా మెడికల్ షాప్ నిర్వాహకుడు రవీందర్ నాయక్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వం నిషేధిత మందులు, టానిక్ లు మెడికల్ షాప్ నిర్వాహకులు విక్రయించి అధిక ధరలు తీసుకోవడంతో పాటు నిషేధించిన మందుల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యాలకు హాని కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

Updated On 7 March 2024 3:38 PM IST
cknews1122

cknews1122

Next Story