ఈశ్వరా…పరమేశ్వరా…! -తీర్థాల సంగమేశ్వరుడు, కూసుమంచి గణపేశ్వరాలయాలను సందర్శించిన దయాకర్ రెడ్డి దంపతులు - నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు ఖమ్మంరూరల్ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలేరు నియోజకవర్గంలోని పలు శైవక్షేత్రాలను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని సంగమేశ్వరుని ఆలయం, కూసుమంచిలోని గణపేశ్వరాలయం, జక్కేపల్లిలోని బాల …

ఈశ్వరా…పరమేశ్వరా…!

-తీర్థాల సంగమేశ్వరుడు, కూసుమంచి గణపేశ్వరాలయాలను సందర్శించిన దయాకర్ రెడ్డి దంపతులు

- నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు

ఖమ్మంరూరల్ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలేరు నియోజకవర్గంలోని పలు శైవక్షేత్రాలను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు.

ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని సంగమేశ్వరుని ఆలయం, కూసుమంచిలోని గణపేశ్వరాలయం, జక్కేపల్లిలోని బాల కోటేశ్వరస్వామి ఆలయాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

కూసుమంచిలో శివలింగానికి పాలాభిషేకం చేసి, భక్తుల కోసం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించి.. నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుడిని మొక్కుకున్నారు.

మంత్రి పొంగులేటి ప్రత్యేక శ్రద్ధతో అన్ని ఆలయాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేయించారని దయాకర్ రెడ్డి తెలిపారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టారని అన్నారు.

జాతరల్లో లోటుపాట్లు తలెత్తకుండా సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారని వివరించారు. భక్తులంతా సంతోషంగా స్వామివారిని దర్శించుకుని, సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. దయాకర్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు తదితరులు ఉన్నారు.

Updated On 8 March 2024 3:50 PM IST
cknews1122

cknews1122

Next Story