నిషేధిత మందులు అమ్మే మెడికల్ షాపులపై కఠిన చర్యలు
దుర్గ భవాని మెడికల్ షాప్ ఓనర్ పై త్వరలో చర్యలు
డ్రగ్ ఇన్స్పెక్టర్ జి సురేందర్
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 09
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మఠంపల్లి మండలం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో మంగతో కలిసి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ జి సురేందర్,కోదాడ ఎక్సేంజ్ ఎస్సై గోవర్ధన్ పత్రిక విదేకుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్ మాట్లాడుతూ న్యూ దుర్గ భవాని మెడికల్ షాప్ ఓనర్ రవీందర్ నాయక్ తన మెడికల్ షాపులో మత్తు కలిగించే నిషేధిత హాబిట్ ఫానింగ్ మందులు అతను షాపు పేరుని కొని అమ్ముతున్నాడు అన్న సమాచారం మేరకు మొట్టమొదటగా షాపును తనిఖీ చేయడం జరిగిందని
ఆ మందులకు సంబంధించిన ఎటువంటి బిల్లులు దొరకకుండా చేయడం జరిగిందని సంబంధిత అధికారి ఎక్సైజ్ ఎస్సై గోవర్ధన్ కోదాడ వారు మేము కలసి దుర్గ భవాని షాప్ ఓనర్ రవీందర్ నాయక్ ఇంటికి వెళ్లి ఇంటిలో మొత్తం తనిఖీ చేయగా ఎటువంటి ఆధారాలు లేకుండా నిలువ చేసిన మందులు దొరకడం జరిగిందని వాటిని వెంటనే సీజ్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగిందని
తర్వాత పూర్తి ఎంక్వయిరీ చేసి అతనిపై చర్యలు తీసుకుంటామని అదే విధంగా లైసెన్సు లేకుండా మందులు నిల్వ చేసినందుకు చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని ముందుగా అతను నోటీసులు ఇచ్చిన తర్వాతనే యాక్షన్ తీసుకుంటున్నామని వాస్తవంగా బీఫార్మసీ లేదా ఎంఫార్మెన్స్ చేసిన వారు మాత్రమే మెడికల్ షాపులు నిర్వహించటానికి పూర్తి అథారిటీ ఉంటుందని
ఆ విధంగా లేనియెడల అట్టివారిపై చర్యలు తీసుకుంటామని ఇవన్నీ చేస్తూ ఉండగా ఈమధ్య తెలిసిన విషయం మరొకటి ఏమిటంటే మెడికల్ షాపు సర్టిఫికెట్ ఒకరి పేరు ఉంటే నిర్వహణ వేరే ఒకరు చేస్తున్నారని అతి త్వరలో అట్టి షాపులపై ఎంక్వయిరీ చేసి వారిపై కూడా కేసు నమోదు చేస్తామని అదేవిధంగా ప్రతి నెల మండల పరిధిలో ఉన్న మెడికల్ షాపులను విధిగా తనిఖీలు చేయడం జరుగుతుందని ఏమైనా ఇటువంటి సంఘటన జరిగితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కోదాడ ఎక్సైజ్ ఎస్సై గోవర్ధన్ మాట్లాడుతూ డిప్యూటీ కమిషనర్ నల్లగొండ వారి ఆదేశాల ప్రకారం జిహెచ్ఓ కోదాడ టీం గత వారం పది రోజుల నుండి గంజాయి విక్రయిస్తున్నారని సమాచారంతో కొంతమందిని విచారించగా అందులో మత్తు సిరప్ తీసుకుంటున్నారన్న సమాచారం తెలుపగా అట్టి విషయాన్ని కోదాడలో ఆరా తీయగా మఠంపల్లి లోని దుర్గ భవాని మెడికల్ షాప్ ఓనర్ రవీందర్ కొనుగోలు చేస్తున్నాడని సమాచారం మేరకు
అతని ఇంటిలో తనిఖీ చేయగా 80 బాటిల్లు 150 టాబ్లెట్స్ దొరికినవని ఇతని ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే రెండు ఏజెన్సీలు కోదాడలో ఒకటి శ్రీ సాయి దుర్గ ఫార్మా మెడికల్ 2 శ్రీ వెంకట సాయి సర్జికల్ మెడికల్ అనువారు ఇద్దరు ఈ తతంగం నడిపిస్తునారని వారిని కూడా పరిగణలోనికి తీసుకోవడం జరిగిందని మరల ఇక్కడ గాని ఈ పరిసర ప్రాంతాలలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు మరల పునరావృతం అయితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మఠంపల్లి తాసిల్దార్ మంగ మాట్లాడుతూ మెడికల్ షాప్ ఓనర్లు ప్రజలకు ఉపయోగపడే మందులు అమ్మాలే తప్ప వారిని చెడు మార్గంలో ప్రవేశించేలా ఈ దుశ్చర్యక పాల్పడటం మంచిది కాదని అదే విధంగా యువత పెడదారిన వెళ్లకుండా సరిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అలాగే మెడికల్ షాప్ ఓనర్లు రోగులను బాగు చేసే మందులు ఇవ్వాలే తప్ప వారికి నష్టం కలిగించే జీవితాలు నాశనం అయ్యే డ్రగ్స్ కలిగిన మందులు ఇవ్వడం చట్టపరమైన నేరం అన్నారు.