సిద్ధం సభలో అపశ్రుతి.. తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త మృతి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. సభకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త ఒకరు మరణించారు. ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన సభ ఆరు గంటల వరకు కొనసాగింది. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం అనంతరం జనాలు సభాస్థలి నుంచి బయటకు …

సిద్ధం సభలో అపశ్రుతి..

తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త మృతి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. సభకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త ఒకరు మరణించారు.

ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన సభ ఆరు గంటల వరకు కొనసాగింది.

ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం అనంతరం జనాలు సభాస్థలి నుంచి బయటకు వెళ్తుండగా గేట్‌ వద్ద తొక్కిసలాట జరిగింది.

ఈ తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త ఒకరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Updated On 10 March 2024 10:26 PM IST
cknews1122

cknews1122

Next Story