ప్రజల కష్టాలు పట్టించుకోని రిజిస్ట్రేషన్ అధికారులు సమయ పాలన పాటించని రిజిస్ట్రేషన్ అధికారితో పాటు సిబ్బంది. గంటల తరబడి నిరీక్షణ చేస్తున్న ప్రజలు శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం : మార్చ్ 11( సి కె న్యూస్ ) ఫరూఖ్ నగర్ మండలం లోని రిజిస్ట్రేషన్ అధికారితో పాటు సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉదయం 10.30 గంటల తరువాత కూడా ఎవరూ రాలేదన్నారు. రిజిస్ట్రేషన్ కోసం, …

ప్రజల కష్టాలు పట్టించుకోని రిజిస్ట్రేషన్ అధికారులు

సమయ పాలన పాటించని రిజిస్ట్రేషన్ అధికారితో పాటు సిబ్బంది.

గంటల తరబడి నిరీక్షణ చేస్తున్న ప్రజలు

శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం : మార్చ్ 11( సి కె న్యూస్ )

ఫరూఖ్ నగర్ మండలం లోని రిజిస్ట్రేషన్ అధికారితో పాటు సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉదయం 10.30 గంటల తరువాత కూడా ఎవరూ రాలేదన్నారు.

రిజిస్ట్రేషన్ కోసం, అధికారుల కోసం ప్రజలు కార్యాలయం వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. ప్రతీ రోజు ఇదే విధానం కొనసాగుతుందని తెలిపారు. పనుల కోసం ప్రజలు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు.

ఇక్కడి రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated On 11 March 2024 11:44 AM IST
cknews1122

cknews1122

Next Story