పరామర్శిస్తూ.. ఓదారుస్తూ..
కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ముమ్మర పర్యటన
కూసుమంచిలో హఫీజ్ ఉద్దీన్ ఇంట రంజాన్ దీక్క్షా పరులతో ముచ్చట
కూసుమంచి: కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూసుమంచి మండలం లో మంగళవారం ముమ్మరంగా పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురి ఇళ్లకు వెళ్లి పరామర్శించి.. ఆర్థిక సాయం అందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నాయకన్ గూడెంలో కంచర్ల ఉప్పమ్మ, ముదిరెడ్డి గోపాల్ రెడ్డి, బొబ్బా అచ్చమ్మ, బయ్య నాగలక్ష్మి, ఎస్కే యాకూబ్ బీ లను పరామర్శించారు. ఆ తర్వాత గట్టుసింగారం, జుజుల్ రావుపేట గ్రామాల్లో పలువురి ఇళ్లకు వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
సత్యనారాయణ రాజు, దాట్ల వెంకన్న, పడిశాల సక్కుబాయి, వెంకటి, నాగమ్మ, శ్రీరాముల నీలమ్మ ల ఆరోగ్య పరిస్థితిని అడిగారు. అనంతరం లింగారం తండా లో వడిత్యవెంకటరాం ను పరామర్శించారు. ఎవరూ అధైర్య పడోద్దని.. అండగా ఉంటామని అభయమిచ్చారు.
రాజీవ్ గాంధీకి నివాళి..ముస్లింలతో మాటామంతీ
కూసుమంచి లోని ప్రధాన రహదారి వెంట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు హఫీజుద్దీన్ నివాసానికి వెళ్లారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా.. తొలి రోజా (ఉపవాసం) దీక్షను చేపట్టగా శుభాకాంక్షలు తెలిపారు.
మసీద్ కమిటీ పెద్దలు, ముస్లింలతో ముచ్చటించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా.. ప్రశాంతంగా ఉపవాస మాసం గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, నాయకులు లింగారెడ్డి భీష్మాచారి, సూర్యనారాయణ రెడ్డి, పెండ్ర అంజయ్య, బెల్లంపల్లి లక్ష్మీకాంతమ్మ, రవీందర్, కంచర్ల నరేందర్ రెడ్డి, ఇందుర్తి వెంకటరెడ్డి, సుధీర్ రెడ్డి , శ్రీనివాసరెడ్డి, మల్సూరు, కనతారు నాగయ్య, నాగండ్ల నరసింహారావు, ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.