పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన వంగ వీరరఘు
తండ్రి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేస్తున్న అనంతారం హెడ్మాస్టర్
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 13
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం తెలంగాణ ఉపాధ్యాయుల సంఘం గుండాల మండలం అధ్యక్షులుగా ఉన్నత స్థాయికి ఎదిగిన అనంతారం హై స్కూల్ హెడ్మాస్టర్ వంగ వీరరఘు సేవా కార్యక్రమాల్లోనూ భేశ్ అనిపించుకుంటున్నారు
.ఆయన తండ్రి వంగ కనకయ్య జ్ఞాపకార్థం ఆత్మకూరు మండలం కూరెళ్ళ గ్రామం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మూడు నెలలకు సరిపడే స్నాక్స్ వితరణగా అందజేశారు.
అంతే కాకుండా గుండాల మండలంలోని గుండాల వెల్మజాల సితారాంపూరం వస్తాకొండూర్ పెద్దపడిశాల సుద్దాల ఆనంతారం ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన పెన్నులు పెన్సిల్లు చెక్మార్ స్కేల్ రబ్బర్ వంటివి కూడా అందజేశారు.
ఈ సందర్భంగా హెడ్మాస్టర్ వంగ వీరరఘు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలంటే ఎంతో ఇష్టమని వారికి తోచినంత సహాయం అందిస్తున్నాని ఆయన అన్నారు. దేశం గర్వించేలా భవిష్యత్తును నిర్మించుకుని అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదువుకొని కన్న తల్లి దండ్రులను పుట్టి పెరిగిన గ్రామాన్ని ఆదరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బైరి విశ్వనాథం గౌడ్ నందా దీపం వెంకటేశం కోకల శ్రీనివాస్ పోతుగంటి సంపత్ కుమార్ గౌడ్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఎం ఎన్ ఓ కోండోజు శ్రవణ్ కూమార్ విద్యార్థినీ విద్యార్థులు గ్రామస్థులు పాల్గొన్నారు.