టెట్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి!
ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు…
మూడు లక్షల మందికి ఊరట
సికె న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్: డీఎస్సీకి ముందే టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11,062 ఉపాధ్యాయుల నియామకానికిగానూ గత నెల 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
డీఎస్సీ రాయాలంటే టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి టెట్ నిర్వహించాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
సాధ్యమైనంత త్వరగా టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుమారు మూడు లక్షల మంది అభ్యర్థులకు ఊరట లభించనుంది.