వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య సికె న్యూస్ , మార్చి 14, జిల్లా ప్రతినిధి, పెంచలయ్య : వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని స్టాలిన్ నగర్,బుంగ బావి సెంటర్ కి చెందిన ఉస్మాన్ భాష సోమరాజు పల్లి పంచాయతీ పరిధిలోని తిరుమల పట్టాభి నగర్ కి చెందిన రేష్మ 20 సంవత్సరాలు వయస్సు యువతి తో రెండు సంవత్సరాలు …

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

సికె న్యూస్ , మార్చి 14, జిల్లా ప్రతినిధి, పెంచలయ్య : వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని స్టాలిన్ నగర్,బుంగ బావి సెంటర్ కి చెందిన ఉస్మాన్ భాష సోమరాజు పల్లి పంచాయతీ పరిధిలోని తిరుమల పట్టాభి నగర్ కి చెందిన రేష్మ 20 సంవత్సరాలు వయస్సు యువతి తో రెండు సంవత్సరాలు క్రితం వివాహం అయింది. వీరికి పది నెలలు నవాషాద్ అనే బాలుడు ఉన్నాడు.

వివాహం అయినప్పటి నుండి వరకట్న వేధింపులతో భర్త ఉస్మాన్ భాష, అత్తమామలు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని రేష్మ తల్లిదండ్రులు తెలిపారు.ఇటీవల అదనంగా రెండు లక్షలు, గృహోపకరణాలు కోసం 30 వేల రూపాయలను ఇవ్వడం జరిగిందన్నారు.

భర్త ఉస్మాన్ భాష, అత్త,మామలు కలిసి రేష్మను వరకట్న వేధింపులకు గురి చేయడంతో బుధవారం రాత్రి ఎవరు లేని సమయంలో రేష్మా (20 సంవత్సరాలు )వయస్సు కలిగిన వివాహిత స్లాబ్ ఉక్కు కు ఉరి వేసుకుని మృతి చెందింది.

ఉరి వేసుకొని కొన ఊపిరి తో ఉన్నా రేష్మా ను కుటుంబ సభ్యులు స్థానిక ప్రవేట్ వైద్యశాల కు తరలించారు.అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కందుకూరు ప్రవేట్ హాస్పిటల్ కి తీసుకోని వెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శ్రీరామ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Updated On 14 March 2024 11:27 PM IST
cknews1122

cknews1122

Next Story