బీఆర్ఎస్ MLA తమ్ముడు అరెస్ట్ సి కె న్యూస్ ప్రతినిధి నియోజకవర్గం. పటాన్ చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు అక్రమ మైనింగ్ కేసులో పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పటాన్ చెరు మండలం లక్డారం గ్రామంలో అక్రమ క్వారీలు క్రషర్ల నుండి పరిమితికి మించి మైనింగ్ చేశారని తహసిల్దార్ ఫిర్యాదుతో పటాన్ చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే …

బీఆర్ఎస్ MLA తమ్ముడు అరెస్ట్

సి కె న్యూస్ ప్రతినిధి నియోజకవర్గం.

పటాన్ చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు అక్రమ మైనింగ్ కేసులో పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పటాన్ చెరు మండలం లక్డారం గ్రామంలో అక్రమ క్వారీలు క్రషర్ల నుండి పరిమితికి మించి మైనింగ్ చేశారని తహసిల్దార్ ఫిర్యాదుతో పటాన్ చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు

గూడెం మధుసూదన్ రెడ్డిని తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్టు చెప్పారు.

చీటింగ్ మైనింగ్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటాన్ చెరు పట్టణంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడ సర్వే నెంబర్ 32/ఆర్​యూయూ లో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్​ సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కల్వకుంట్ల కన్నా రావు గ్యాంగ్ ప్రయత్నించిందని సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

కన్నారావు ఈ నెల 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు, జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్ లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పాతారని, భూమి చుట్టూ ఉన్న ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చివేశారని ఫిర్యాదులో బండోజు శ్రీనివాస్​ పేర్కొన్నారు.

అదేవిధంగా ఆ భూమిలోని గుడిసెకు నిప్పు పెట్టి కాల్చారని, అక్కడ ఉన్న ల్యాండ్ టేకర్స్ పై దాడికి దిగారని తెలిపారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కన్నా రావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీబీ డ్రైవర్, ఓనర్ తో పాటు ఐదుగురిని రిమాండ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated On 15 March 2024 11:22 AM IST
cknews1122

cknews1122

Next Story